బ్రహ్మాస్త్రం
బ్రహ్మాస్త్రం పెద్ద పురుగు లను నియంత్రించుటకు ఉపయోగిస్తారు.బ్రహ్మాస్త్రం తయారీ కి కావలసిన పదార్ధాలు :
దేశీయ లేదా నాటు ఆవు మూత్రం :10 లీటర్లు ,
వేప ఆకులు :3 కిలోలు,
సీతాఫలం ఆకులు :2 కిలోలు ,
నాటు బొప్పాయి ఆకులు :2 కిలోలు,
దానిమ్మ ఆకులు :2 కిలోలు,
జామ ఆకులు :2 కిలోలు,
లాంటానా (అత్తా కోడలు )ఆకులు :2 కిలోలు,
ఇంకా పెద్ద పల్లేరు ఆకులు ,మారేడు ఆకులు ,ఆముదము ఆకులు ,నేలవేము ఆకులు , పిచ్చి తులసి ఆకులు ఏవైనా 6 రకాల ఆకులను ఉపయోగించి బ్రహ్మాస్త్రం ను తయారు చేయవచ్చు .
ముందుగా వేప ఆకులు ,సీతాఫలం ఆకులు ,నాటు బొప్పాయి ఆకులు ,దానిమ్మ ఆకులు ,జామ ఆకులు మరియు లాంటానా కెమెరా ఆకులను దంచి గుజ్జుగా చేసుకోవాలి.
కుండలో 10 లీటర్లు ఆవు మూత్రము పోసి వేడి చేస్తూ ఉండాలి .తదుపరి ముందుగా గుజ్జు గా చేసుకున్న ఆకులు అన్నింటినీ ఒక్కొక్కటిగా ఆవు మూత్రము లో వేసి 5 సార్లు మరిగించాలి.
కుండలో 10 లీటర్లు ఆవు మూత్రము పోసి వేడి చేస్తూ ఉండాలి .తదుపరి ముందుగా గుజ్జు గా చేసుకున్న ఆకులు అన్నింటినీ ఒక్కొక్కటిగా ఆవు మూత్రము లో వేసి 5 సార్లు మరిగించాలి.
తదుపరి 24 గంటలు చల్లార్చి, పలుచని బట్టతో వడపోసి డబ్బా లో నిలువ చేయాలి.ఈవిధంగా తయారు చేసుకున్న బ్రహ్మాస్త్రం 2 - 2.5 లీటర్లు ను 100 లీటర్లు నీటి లో కలిపి పంట పై పిచికారీ చేయాలి.ఇలా తయారు చేసిన బ్రహ్మాస్త్రం 6 నెలల వరకు కీటక నాశిని గా ఉపయోగించు కోవచ్చు .