ఘన జీవామృతం

ఘన జీవామృతం తయారి విధానం :

ఘన జీవామృతం తయారికి కావలసిన పదార్ధాలు :

దేశీయ ఆవు పేడ :100 కిలోలు

దేశీయ ఆవు మూత్రము :5 లీటర్లు

నల్ల బెల్లం :2 కిలోలు

   లేదా

చెరకు రసం :4 లీటర్లు

ద్వి దళ బీజాలకు చెందిన ఏదైనా పప్పు ధాన్యాల పిండి :2 కిలోలు

పుట్ట మట్టి :1/2 కిలోలు

తయారు చేయు విధానం :
 


ముందుగా  తీపి పదార్ధాన్ని (బెల్లము) దంచి  పొడి గా  చేసుకోవాలి ,నల్ల బెల్లము జిగురుగా వున్నట్లయితే దేశీయ ఆవు మూత్రము లో కరిగించాలి . దేశీయ ఆవు పేడ, మీద ద్వి దళ బీజాలకు చెందిన ఏదైనా పప్పు ధాన్యాల పిండి,పుట్ట మట్టి ని చల్లి  ,దేశీయ ఆవు మూత్రము లో కరిగించిన బెల్లమును చిలకరించి  చేతితో బాగా కలపాలి  ,లేదా పారతో బాగా కలపాలి  .కూరగాయ పంటలకు  పెద్దపెద్ద ఉండలుగా చేసి 10 రోజులు  నీడలో ఆర బెట్టాలి .వరి ,చెరకు పంటలకు  పొడి, పొడి గా చేయాలి.

ఆ తర్వాత ఈ ఘన జీవామృతమును 100 కిలోల  పశువుల ఎరువుతో కలిపి 1 ఎకరం పొలం లో చల్లి  ,పొలాన్ని దున్నాలి.