జీవామృతం పిచికారి చేసే పధ్ధతి

జీవామృతం పిచికారి చేసే పధ్ధతి :

3 నెలల్లో (60 నుంచి 90 రోజుల్లో ) పూర్తయ్యె పంటలకు :ఎకరానికి 

మొదటిసారి :(విత్తనం నాటిన 1 నెలకి ) 5 లీటర్ల జీవామృతం ,100 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .

రెండో సారి :(మొదటి సారి పిచికారి చేసిన 21రోజుల తర్వాత ) 10 లీటర్ల జీవామృతం,150 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .

మూడో సారి :(రెండో సారి పిచికారి చేసిన 21రోజుల తర్వాత )20 లీటర్ల జీవామృతం,200 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .

నాలుగో  సారి :(గింజ ఏర్పడే టప్పుడు   -మిల్కింగ్ స్టేజి  )5 లీటర్ల మజ్జిగ ,200 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .చివరి సారి జీవామృతం అవసరం లేదు . 

6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో ) పూర్తయ్యె పంటలకు :ఎకరానికి 

మొదటిసారి :(విత్తనం నాటిన 1 నెలకి ) 5 లీటర్ల జీవామృతం ,100 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .

రెండో సారి :(మొదటి సారి పిచికారి చేసిన 30రోజుల తర్వాత ) 10 లీటర్ల జీవామృతం,150 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .

మూడో సారి :(రెండో సారి పిచికారి చేసిన 30రోజుల తర్వాత ) 200 లీటర్ల నీమాస్త్రం  ను పిచికారి చేయాలి .

నాలుగో  సారి :( మూడో సారి పిచికారి చేసిన 30రోజుల తర్వాత  )20 లీటర్ల జీవామృతం ను ,200 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .

ఐదో సారి :(నాలుగో సారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత) 20 లీటర్ల జీవామృతం ను ,200 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .


ఆరో  సారి :(గింజ ఏర్పడే టప్పుడు   -మిల్కింగ్ స్టేజి) 5 లీటర్ల మజ్జిగ ,200 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .చివరి సారి జీవామృతం అవసరం లేదు .

12 నెలల్లో (సంవత్సరంలో)పూర్తయ్యె పంటలకు :ఎకరానికి 

మొదటిసారి :(విత్తనం నాటిన 1 నెలకి ) 5 లీటర్ల జీవామృతం ,100 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .

రెండో సారి :(మొదటి సారి పిచికారి చేసిన 30రోజుల తర్వాత ) 10 లీటర్ల జీవామృతం,150 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .

మూడో సారి :(రెండో సారి పిచికారి చేసిన 30రోజుల తర్వాత ) 20 లీటర్ల జీవామృతం,200 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .

నాలుగో  సారి :( మూడో సారి పిచికారి చేసిన 30రోజుల తర్వాత  )5 లీటర్ల పుల్లటి మజ్జిగ ,200 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .

ఐదో సారి :(నాలుగో సారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత)20 లీటర్ల జీవామృతం ను ,200 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .

ఆరో  సారి :(ఐదో సారి  పిచికారి చేసిన 30 రోజుల తర్వాత)20 లీటర్ల జీవామృతం ను ,200 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .

ఏడో సారి :(ఆరో సారి  పిచికారి చేసిన 30 రోజుల తర్వాత) 20 లీటర్ల జీవామృతం ను ,200 లీటర్ల నీటి తో పిచికారి చేయాలి .

ఎనిమిదో సారి (ఏడో సారి పిచికారి చేసిన 30 రోజుల తర్వాత) 2 లీటర్ల కొబ్బరి నీళ్ళను 200 లీటర్ల నీళ్ళతో చివరిగా  పిచికారి చేయాలి .