బెల్లపు మడ్డి ఉపయోగించి జీవామృతం తయారుచేసే విధానం:
బెల్లపు
మడ్డి అనగా
బెల్లం తయారు
చేసేటప్పుడు వ్యర్ధంగా మిగిలే పదార్ధాన్నే బెల్లపు మడ్డి
అని అంటారు బెల్లపు మడ్డిని
ఉపయోగించి జీవామృతం
తయారు చేసేటప్పుడు బెల్లంకు బదులుగా 4లీటర్ల బెల్లపుమడ్డిని ఉపయోగిస్తాము. మంచి
నీరు ,ఆవు మూత్రము ,ఆవు పేడ,పప్పుధాన్యాల పిండి,పొలం గట్టు మన్ను
అన్నీ జీవామృతం తయారీలో
ఎంతనిష్పత్తిలో వాడుతామో
,అంతే నిష్పత్తిలోఉపయోగిస్తాము.
(గమనిక: సేంద్రియ పద్దతి లో బెల్లం ను తయారు చేసినపుడు ,వచ్చిన బెల్లపు మడ్డినే , జీవామృతం తయారీ లో వాడాలి . )
తాటి పండ్ల ను ఉపయోగించి జీవామృతం తయారుచేసే విధానం:
బాగా పండిన
తాటి పండ్లను ఉపయోగిస్తాము. ముందుగా
తాటి పండ్లకు బాహ్య చర్మము ను తొలగించి రసభరితమైన పసుపు
పచ్ఛని టెంకలను, కొద్ది పాటి
నీటి ని వేరే పాత్ర లోనికి
తీసుకొని పసుపు
పచ్ఛని రసభరితమైన
టెంకలను చేతితో
పిసికి టెంకలను
పారవేయాలి .తాటిపండ్ల
గుజ్జు ను ఉపయోగించి నాణ్యమైన జీవామృతం తయారుచేయవచ్చు.మంచి నీరు
,ఆవు మూత్రము
,ఆవు పేడ ,పప్పు ధాన్యాల పిండి,పొలం గట్టు మన్ను
అన్నీ జీవామృతం
తయారీలో ఎంత నిష్పత్తిలో వాడుతామో ,అంతే
నిష్పత్తిలో ఉపయోగిస్తాము.