ప్రకృతి సిద్ధమైన పురుగు మందుల తయారీ పద్ధతులు:
ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు రసాయనిక పురుగు మందులు వాడకూడదు .స్థానికంగా దొరికే ఔషధ మొక్కల ఆకులతో నీమాస్త్రం ,బ్రహ్మాస్త్రం మరియు అగ్ని అస్త్రం లాంటివి తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది .
గమనిక:పురుగు ల ను నియంత్రించుటకు పై కషాయాలను రెక్కల పురుగుల దశలో పంట పై పిచికారి చేయడం వల్ల సమర్ధవంతం గా నివారించ వచ్చు.
తెగుళ్ళ నివారణకు గోబాణం ఇంకా ఆవు మూత్రం ,పేడ ,ఇంగువ ద్రావణం పంట పై పిచికారి చేయటం వల్ల శిలీంద్ర సంబంధమైన తెగుళ్ళను నివారించ వచ్ఛు
నీమాస్త్రం :
రసం పీల్చే చిన్న పురుగుల నివారణకు ఉపయోగిస్తారు .ఒక ఎకరం పంట పొలం పై 100 లీ్టర్లు నీమాస్త్రం ను పిచికారి చేయాలి.
నీమాస్త్రం తయారీ కి కావలసిన పదార్ధాలు :
మంచి నీరు : 100 లీటర్లు
పచ్చి వేప ఆకులు : 5 కిలోలు
లేదా
వేప కాయ ల పొడి : 5 కిలోలు
దేశవాళీ లేదా నాటు ఆవు మూత్రం : 5 లీటర్లు
దేశవాళీ లేదా నాటు ఆవు పేడ: 1 కిలో
తయారీ విధానం : ముందుగా 5 కిలోల వేప ఆకుల ను దంచి గుజ్జు గా తయారు చేసుకోవాలి.డ్రమ్ము లో లేదా సిమెంటు తొట్టి లో 100 లీటర్లు మంచి నీరు పోసి అందులో 5 కిలోల వేప ఆకు ల గుజ్జు ను కలపాలి, 5 లీటర్ల దేశీయ లేదా నాటు ఆవు మూత్రం ను కలపాలి .చివరగా 1 కిలో దేశీయ లేదా నాటు ఆవు పేడ ను నీటిలో కరిగించాలి .పై పదార్ధాలన్నీ నీటి లో బాగా కలిసే లా కర్రతో సవ్య దిశ లో కలియ త్రిప్పాలి . అనంతరం నీమాస్త్రం తయారు చేసే పాత్ర పై గోనె సంచి లేదా పలుచని వస్త్రం తో కప్పి ఉంచి పై మిశ్రమాన్ని 24 గంట ల పాటు పులియ నివ్వాలి .పై నీమాస్త్రం ను పలుచని వస్త్రం తో వడపోత చేసి, నీరు కలపకుండా స్ప్రేయర్ ద్వారా పంట పై పిచికారీ చేయాలి.ఇలా తయారు చేసుకున్న నీమాస్త్రం ను 6 నెలల వరకు ఉపయోగించు కోవచ్చు.