అగ్నిఅస్త్రం
ఆకు ముడత,కాండం తొలుచు పురుగులను అదుపు చేయడం లోఅగ్నిఅస్త్రం ప్రధాన పాత్ర వహిస్తుంది .
అగ్నిఅస్త్రం తయారీకి కావలసిన పదార్ధాలు
దేశీయ ఆవు మూత్రం : 10 లీటర్లు
వేప ఆకు జిగురు :5 కిలోలు పొగాకు పొడి:1 కిలో
పచ్చి మిరపకాయల గుజ్జు :500 గ్రాములు
వెల్లుల్లి గుజ్జు :500 గ్రాములు
ముందుగా 1 కిలో పొగాకు ను ఎండబెట్టి పొడి చేసుకోవాలి ,5 కిలోలు వేప ఆకులను దంచి గుజ్జుగా చేసుకోవాలి .అదేవిధంగా పచ్చి మిరపకాయల ను మరియు వెల్లుల్లి కూడా గుజ్జు గా చేసి సిద్దం చేసుకోవాలి .
అగ్నిఅస్త్రం తయారీ విధానం:
ఒక కుండ లో 10 లీటర్ల దేశీయ ఆవు మూత్రం పోసి తరువాత 5 కిలోల వేప ఆకుల గుజ్జు ,పొగాకు పొడిని ,పచ్చి మిరపకాయల గుజ్జు మరియు వెల్లుల్లి గుజ్జు ను కూడా కలిపి నాలుగు సార్లు పొంగు వచ్చే వరకు మరిగించాలి .కుండ మూతి భాగాన్ని గుడ్డ తో కప్పి 24 గంటలు చల్లార్చి ,అగ్నిఅస్త్రం ను వడపోసి సీసా లో నిల్వ చేసుకోవాలి .ఈ విధంగా తయారు చేసుకున్న అగ్నిఅస్త్రం 3 నెలల వరకు ఉపయోగించుకోవచ్చు
(గమనిక :అగ్నిఅస్త్రం ను సీసా లో నిల్వ చేసేటప్పుడు, సీసా మూతను వదులుగా బిగించాలి )
పిచికారి చేసే విధానం : అగ్నిఅస్త్రం (2-3 లీటర్లు ) ను 100 లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరం పొలం పై పిచికారీ చేసుకోవాలి