గోబాణం:(శిలీంద్ర నాశిని) నీటిలో ,పుల్లటి మజ్జిగ ను కలిపితే గోబాణం తయారవుతుంది . ఒక ఎకరానికి 100 లీటర్లు నీళ్లలో, 6 లీటర్లు పుల్లటి మజ్జిగ ను కలిపి పంట పై పిచికారీ చేసుకోవాలి .దీన్ని పిచికారీ చేయడం ద్వారా ఫంగస్ బెడద నుంచి పంటలను కాపాడుకోవచ్చు .
ఆవు మూత్రము -పేడ -ఇంగువ ద్రావణం :
వరి లో వచ్చు తెగుళ్ళను సమర్ధవంతం గా అరికడుతుంది.
కావలసిన పదార్ధాలు :
దేశీయ ఆవు లేదా నాటు ఆవు మూత్రం : 5 లీటర్లు
దేశీయ ఆవు లేదా నాటు ఆవు పేడ : 5 కిలోలు
మంచి నీరు : 5 లీటర్లు
ఇంగువ పొడి : 100 గ్రాములు
తయారీ విధానం :
మట్టి కుండ లోగాని లేదా ప్లాస్టిక్ పాత్రలో గాని ,దేశీయ ఆవు లేదా నాటు ఆవు మూత్రం 5 లీటర్లు ,దేశీయ ఆవు లేదా నాటు ఆవు పేడ 5 కిలోలు, మంచి నీరు 5 లీటర్లు, పై పదార్ధాలు అన్నీ కలిసిపోయేలా కలియ బెట్టాలి. 4 రోజులు పులియ నివ్వాలి .