ఆవు యొక్క ప్రాముఖ్యత



సేంద్రియ వ్యవసాయం లో ఆవు యొక్క ప్రాముఖ్యత :

భూమి లోని సూక్ష్మ జీవులను ఉత్తేజ పరిచేందుకు ఉపయోగపడే దేశీయ లేదా నాటు ఆవుల  పేడ మాత్రమే . ఒక గ్రాము దేశీయ ఆవు పేడలో 300 కోట్ల నుంచి 500 కోట్ల వరకు  ఉపయోగపడే  సుక్ష్మ జీవులు ఉంటాయి . ఇది ఒక అద్భుతమైన సూక్ష్మజీవుల 'తోడు' లాంటిది . 
                               
                           కేవలం దేశీయ ఆవు మాత్రమే కావాలి . పేడ ను  తాజాగా ఉపయోగిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది . అలాగే ఆవు మూత్రము ఎంత పాతది అయితే దాని ప్రభావము అంత ఎక్కువగా ఉంటుంది . ఒక ఎకరానికి ఒక నెలలో కనీసం ఒకసారి 10 కిలోల దేశీయ ఆవు పేడ ని ఉపయోగిస్తే చాలు .  

ట్రక్కుల కొద్దీ ,టన్నుల కొద్దీ పశువుల ఎరువును కొనుగోలు చేసి భూమికి వాడే  అవసరం  లేదు . కేవలం జీవామృతం ఉపయోగిస్తే చాలు . జీవామృతం తయారుచేయడానికి కేవలం దేశీయ ఆవు లేదా నాటు ఆవు పేడ ,మూత్రము మాత్రమే ఉపయోగించుట  ఉత్తమం .

ఆవు మూత్రము సేకరించు విధానము :