బీజామృతం

                                         బీజామృతం

బీజామృతం తయారీకి కావలసిన పదార్ధాలు :

1.  నీరు -20 లీటర్లు 

2. ఆవు మూత్రము -లీటర్లు

3. ఆవు పేడ -కిలోలు 

4. పొడి సున్నం -50 గ్రాములు 

5.  పుట్ట మన్ను లేదా పొలం గట్టు మన్ను -దోసెడు 


తయారు చేసే విధానం : 
1) ఆవు పేడ ను ఒక గుడ్డ సంచిలో మూట కట్టి 20 లీటర్ల  నీరు న్న తొట్టిలో  12 గంటలు వుంచాలి .

2) ఒక లీటరు నీటిని వేరే పాత్రలో తీసుకొని అందులో 50 గ్రాముల సున్నం కలిపి ఒక రాత్రంతా ఉంచాలి .
3) తరువాత   రోజు ఉదయాన్నే నానబెట్టిన పేడ మూట ను చేత్తో పిండాలి .

4) పేడ నీళ్ళున్న తొట్టిలో పొలం గట్టు మట్టిని వేసి  కర్రతో కలియ తిప్పాలి .

5) 5 లీటర్ల దేశీయ ఆవు మూత్రాన్ని ,సున్నపు నీటిని పేడ నీరు న్న తొట్టిలో కలుపుతూ పూర్తిగా   కలిసిపోయే వరకు తిప్పాలి .

విత్తన శుద్ధి చేయటానికి అవసరమైన 'బీజామృతాన్నిఇలా తయారు చేసుకోవాలి .ఏ పంటకు సంబంధించిన విత్తనాలైనా సరే ఈ బీజామృతం లో కలిపి ,విత్తనాలకు బాగా పట్టించి వాటిని ఆరబెట్టి   పంట వేయుటకు    సిద్ధంగా  ఉంచుకోవాలి .