సేంద్రియ రైతు కు స్వాగతం సుస్వాగతం
అనాదిగా మానవుడు సహజ ఆహారాన్ని తీసుకుంటూ చాలా ఆరోగ్యంగా జీవించేవాడు .ఎటువంటి పురుగుమందులు లేకుండా, సహజ ఎరువులను (పశువుల ఎరువు ) ఉపయోగించుకొని, పంటలు పండించేవాడు. పరిసరాలు కలుషితం కాలేదు, కాబట్టి వారు ఆరోగ్యంగా జీవించారు .
కాలక్రమేణా పెరుగుతున్న జనాభా కారణంగా ,ఆహార ధాన్యాల కొరత వల్ల,కేవలం రసాయన ఎరువులు,పురుగు మందులను ఎక్కువగా వినియోగిస్తూ పంటలు పండిస్తున్నాడు.ఫలితంగా పరిసరాల కాలుష్యం,ఆ పంటను తిన్న మానవుడు, రకరకాల వ్యాధులకు లోనవుతున్నాడు .
కాబట్టి మనిషి ఆరోగ్యంగా జీవించడానికి తినే ఆహారం కలుషితం కానిదిగా వుండాలి .ఇప్పుడే మానవుడు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నాడు .సేంద్రియ వ్యవసాయం అంటే పశువుల మల ,మూత్రాలు, పచ్చిరోట్టపైర్లు (green manures) వుపయోగించి నేలను సారవంతము చేస్తూ,పురుగు మందులకు బదులుగా వృక్ష సంబంధిత(ఆకుల ,గింజల తో) కాషాయాలు తయారు చేసుకొని పిచికారీ చేస్తూ, పైరును పెంచుతూ దిగుబడి పెంచు కోవడమే సేంద్రియ వ్యవసాయం .
శ్రీ సుభాష్ పాలేకర్ గారు సునిశిత పరిశోధనతో రూపొందించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం రైతాంగానికి వెలుగు బాట చూపింది .ప్రకృతి వ్యవసాయం చేయడానికి బండ్లకు బండ్లు పేడ అవసరం లేదు .ఒక్క దేశీయ ఆవు పేడ ,మూత్రం తో 30 ఎకరాల్లో పంటలను పండించుకోవచ్చు . ఈ దేశీయ ఆవు ద్వారా లభించే పాలు ,పెరుగు ,నెయ్యి ,పేడ ,మూత్రము మొదలగు వాటిని ఉపయోగించి జీవామృతం, బీజామృతం ఇంకా పసిడి పంటలను పండించే సేంద్రియ మిశ్రమం పంచగవ్య తయారు చేసుకుని పంట పొలాల ను సారవంతము చెయ్యవచ్చు , పంటలను ఆశించే చీడ పీడ లను అరికట్టవచ్చు. కాబట్టి రైతు గోవు యొక్క సంతతిని అభివృద్ధి చేయడానికి ఉత్సాహాని చూపాలి.
అదేవిధంగా సేంద్రియ వ్యవసాయమునకు అనువైన రకాలను ఎంచుకోవాలి .ఎంచుకునే రకం తెగుళ్ళను తట్టుకునే విధంగా వుండాలి లేదా తక్కువ తెగుళ్ళు ఆశించే రకాన్ని ఎంచుకోవాలి, ఈ బ్లాగ్ లో వరి పంటకు సేంద్రియ విధానాలను వివరించబడ్డాయి .